Listen to this article

జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని సాయిబాబా దేవాలయం లో గురువారం ఉదయం గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయ చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినారు. దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి సాయిబాబా విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి మహా హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేసినారు.అనంతరం ట్రేస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కండగట్ల రవి మహా అన్న దాన కార్యక్రమం భాగంగా ముఖ్య అతిథిగా మావునూర్ ఎ సీ పీ వెంకటేశ్వర్లు స్థానిక తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ అన్నదాన కార్యక్రమం నిర్మించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రేస్ సభ్యులు కంబత్తుల ప్రకాష్ వేణు బాసాని వెంకన్న మామిడి రాజు పి ఏ సి ఎస్ చైర్మన్ కుసుమ శరత్ పరిమళ కుమారస్వామి. వినుకొండ శంకరాచారి సుమంగళి క్లాస్ షోరూం సుమన్ గట్టు కిషన్ సింగిరి కొండ రమేష్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..