Listen to this article

జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

మునగపాక మండలం పాటిపల్లి గ్రామంలో ఎ.పి.మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు లోనవకుండా, అత్యుత్తమ చదువులు,సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులలో నైపుణ్యం పెంచడానికి , సృజనాత్మకత పెంచడానికి, విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఈ మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేసిందని, సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద విద్యార్థులకు కిట్ను పంపిణీ, పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలు కనబరిచిన వారిని గుర్తించి షైనింగ్ అవార్డులు పేరిట సత్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూటమి నాయకులు పాల్గొన్నారు.//