

జనం న్యూస్ జులై 10 నడిగూడెం
యూపీఏ వన్ ప్రభుత్వంలో, వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని, దీనికి వ్యతిరేకంగా రైతాంగాన్ని, కూలీలను సమీకరించి సమరశీల పోరాటాల నిర్వహించనున్నట్లు రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు తెలిపారు. ఉపాధి హామీ పనులతో చేపట్టిన పంట కాలువలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు విస్తరించి దేశానికి వెన్నెముక అయిన రైతాంగాన్ని కాపాడాలని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు పరిశ్రమ హోదా కల్పించి, ఎన్నికలకు ముందు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీల మేరకు రుణ విముక్తులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు.