

జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ) సందర్భంగా అమలాపురం రూరల్ మండలం అధ్యక్షుడు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, భాజపా జిల్లా కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయణ ముఖ్య అతిథిగా ఆహ్వానించి, అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో శ్రీ గాయత్రీ శక్తి పీఠం గురుదేవులు శ్రీ హరి హరానంద భారతి స్వామి వారిని పళ్ళు పూలు గురుదక్షిణ మరియు దుస్సాలువాతో సత్కరించి, శ్రీ గురుదేవుల నుండి గురుబోధ మరియు ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.. ఈ కార్యక్రమానికి మండల ప్రధాన కార్యదర్శి బండి ఏసుబాబు, మండల కార్యదర్శి పేరూరి వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి తటవర్తి వెంకటసుబ్బారావు, పెనుమత్స సూర్యనారాయణ రాజు, ఆకుల అచ్యుత రామమూర్తి, చిక్కం సుబ్బారావు మరియు గురుదేవులు శ్రీ హరి హరానంద భారతి స్వామివారి భక్తులు పాల్గొన్నారు..