Listen to this article

జనం న్యూస్ 25 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపాలిటీల మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడడమే అమృత్ 2.0 లక్ష్యం..మున్సిపాలిటీలు అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం..పట్టణ అభివృద్ధి లో రాజకీయం వద్దు.గద్వాల పట్టణ అభివృద్ధి కి కలిసి పనిచేద్దాం..పట్టణ బిజెపి కౌన్సిలర్లు.. ఈరోజు గద్వాల పట్టణంలోని డికె.బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు మాట్లాడుతూ..పట్టణాల్లో రక్షిత సుస్థిర తాకినీటి సరఫరా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 లక్ష్యమని అన్నారు.. భవిష్యత్తులో 100%తాగు నీటి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని అన్నారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో శాశ్వత మంచినీటి కొరత ఉండకూడదనే ఉద్దేశంతో గద్వాల మున్సిపాలిటీకి అమృత్ 2.0 స్కిం కింద 63.25 కోట్లు కేటాయించడం జరిగిందని అందులో కేంద్ర ప్రభుత్వం వాటా28.75 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం వాటా34.50 కోట్లు తో పంప్ హౌస్ నిర్మాణం కు ఏర్పాటు చేసిందన్నారు.. అనంతరం నది అగ్రహారంలో ఉన్న ఫిల్టర్ బెడ్ ను మరియు శిలా ఫలాకాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫోర్ లీడర్ కుమ్మరి శ్రీనివాసులు,కౌన్సిలర్లు త్యాగరాజు ,బండల పద్మావతి,రజక జయ శ్రీ, గుర్రం నరసింహులు, శ్రీ రాములు, బండల పాండు ,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, బిజెపి సీనియర్ నాయకులు చిత్తారి కిరణ్ ,అనిల్ ఢిల్లీవాలా క్రిష్ణ,పవన్ తదితరులు ఉన్నారు…