Listen to this article

జనం న్యూస్ జూలై 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంలో గురువారం నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని టీబి నోడల్ పర్సన్ లింగం రామకృష్ణ ప్రారంభించి మాట్లాడారు..గ్రామంలో రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కలిగినటువంటి వారు వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచినట్లయితే క్షయ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.వైద్య శిబిరానికి మొత్తం 145మంది రాగా జిల్లా కేంద్రం నుండి తీసుకొని వచ్చిన డిజిటల్ ఎక్స్ రే ద్వారా 106మందికి పరీక్షలు నిర్వహించామని, 28మంది నుండి కళ్ళే సేకరించి పరీక్షల కోసం జిల్లా కేంద్రం లాబరేటరికి పంపించామని,11 మందికి మెడిసిన్ ఇచ్చామని,క్షయ వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం నుండి ఉచితంగా 6 నెలలు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లు అందించమని తెలిపారు.ప్రజలు ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ వైద్య శిబిరంలో టీబి సూపర్వైజర్ సుభాషిని, జిల్లా టీబీ కోఆర్డినేటర్ బడుగు ప్రసాద్,డి ఈ ఓ మాధవరెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ ఫణిందర్, ఏఎన్ఎంలు కె పద్మ,చిలువేరు నాగమణి,.గ్రామపంచాయతీ సెక్రటరీ ఉదయ్ కుమార్, ఆశ వర్కర్లు రమణ,జ్యోతి, లక్ష్మి, సుధారాణి విజయలక్ష్మి, గ్రామపంచాయతీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు..