Listen to this article

జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.

స్వార్థ చింతన స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థ బుద్ధితో తమ సర్వస్వాన్ని పరుల హితం కోసం అర్పించి జీవించే వారే నిజమైన గురువులని అలాంటి గురువుల యొక్క పవిత్రత మరియు సంకల్పబలం వల్లే ధర్మము నిలబడి ఉంటుందని మదాసు స్వామి యాదవ్ వ్యాఖ్యానించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్ర వ్యవస్థాపకులు శ్రీ రామానంద రాయ్ ప్రభు దాస్ కు గురు సత్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని ప్రబోధిస్తూ సుమారు 100 గ్రామాలకు పైగాభాగవతము మరియు భగవద్గీత ప్రచార ఉద్యమాన్ని విస్తరించి వేలాది మందికి జ్ఞాన ప్రబోధాన్ని అందిస్తున్న రామానంద రాయ్ ప్రభుదాస్ గారు అత్యంత గౌరవనీయులని వారి యొక్క జీవితం మొత్తాన్ని భక్తి సిద్ధాంతం ప్రచారం కోసం అంకితమిచ్చారని అటువంటి వ్యక్తిని గురు పౌర్ణమి సందర్భంగా సత్కరించుకునే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలం నుంచి ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నో విశేష కార్యక్రమాల ద్వారా వేలాదిమంది స్ఫూర్తి పొంది సమాజంలో భక్తి తన్మయత్వము పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రఘు, బలరాం ప్రభు, రాజ్ కుమార్ ప్రభు మరియు తదితరులు పాల్గొన్నారు