Listen to this article

జనం న్యూస్ జులై 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం రాంపూర్ రైతులు మాట్లాడుతూ మారుమూల దాట్టమైన అటవీ ప్రాంతాలైన, గుట్టలలో నివాసం ఉంటూ జీవనోపాధి గడుపుతున్న గ్రామలైన మొట్లగూడ రాంపూర్,తొ పాటు చుట్టూ పక్కల 5గ్రామాల రైతుల దాదాపు రాత్రి కురిసిన భారీ వర్షలవల్ల ఆడ ప్రాజెక్ట్ ఎత్తి వేయడం తొ దాదాపు 250ఎకరాలపత్తి పంట నష్టపోయమని, రోడ్లు,సరిగాలేవని నానా అవస్థలు పడుతూ బిక్కు బిక్కు మంటూ మారుమూల దాట్టమైన అటవీ ప్రాంతాలలో, గుట్టలలో సౌకర్యాలు లేక నివాసం ఉంటూ జీవనోపాధి గుడుపుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, నాయకులు, ప్రజా పతినిధులు స్పందించి సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలనిరైతులు వేడుకొంటున్నారు…