Listen to this article

జనం న్యూస్ జులై 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని కొప్పుల గ్రామంలో గల రైతు మిత్ర ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేయగా 60 కంపినీలకు చెందిన బయో మందులు 30 కంపెనీలకు చెందిన కాలం చెల్లిన మందులను ఇఫ్కా కంపెనీకి చెందిన నానో యూరియా ను సీజ్ చేసామని వ్యవసాయ అధికారి గంగా జమున పరకాల వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు కాలం చెల్లిన మందులను స్వాదీనం చేసుకుని కాలం చెల్లిన మందులను రైతులకు విక్రయించిన డీలర్లను హెచ్చరించారు కాలం చెల్లిన మందులు అమ్మడం చట్ట విరుద్ధమని చట్టాన్ని ఉల్లంఘించినందుకు షాప్ పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ తనిఖీ లో శాయంపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….