

జనం న్యూస్ 11 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం నోట్ పుస్తకాలు, పెన్నులను ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి ఎన్.రోజా నిర్మల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు ఎ.ఎస్. ప్రకాశరావు మాష్టారు మాట్లాడుతూ.. సేవాకార్యక్రమంలో భాగంగా నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతీయేటా విద్యార్థినీ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పౌష్టికాహారాన్ని అందజేస్తుంటామని, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో క్లబ్ ఉపకార్యదర్శి ముదిలి శ్రీనివాస్,పాఠశాల ఉపాధ్యాయులు బి. హరికిషోర్ తదితరులు పాల్గున్నారు