

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై11 రిపోర్టర్ సలికినీడి నాగు
తల్లికివందనం. పింఛన్ల చెల్లింపులో ప్రభుత్వం చరిత్ర సృష్టించింది : ప్రత్తిపాటి.
15 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది : ప్రత్తిపాటి
మూడు గ్రామాల్లో రూ.80లక్షల అభివృద్ధిపనులు ప్రారంభించిన ప్రత్తిపాటి
తల్లికి వందనం.. పింఛన్ల పంపిణీ చెల్లింపులో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమిప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, త్వరలోనే అన్నదాతా సుఖీభవ కింద అర్హత కలిగిన ప్రతిరైతుకు రూ.20వేల ఆర్థిక సాయం అందించనున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శుక్రవారం ప్రత్తిపాటి చిలకలూరిపేట మండలంలోని మానుకొండవారిపాలెం, కుక్కపల్లివారిపాలెం, వేలూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొలుత వేలూరులో రూ.38లక్షలతో R.W.S కింద మరమ్మతులు చేపట్టిన నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రత్తిపాటి పున:ప్రారంభించారు. కుక్కపల్లివారిపాలెంలో రూ.10లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం మానుకొండవారిపాలెంలో రూ.32లక్షలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణపనులకు శంఖుస్థాపన చేసి, సంగం డెయిరీ ఉత్పత్తిదారులకు స్వయంగా బోనస్ పంపిణీచేసి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అర్హులకు పథకాలు అందకపోతే సచివాలయసిబ్బంది.. అధికారులే బాధ్యులు ఏడాదిలో కూటమిప్రభుత్వం చేసిన మంచి.. అభివృద్ధి దేశంలో మరే ప్రభుత్వం చేయలేదన్న ప్రత్తిపాటి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది, అధికారులదేనని స్పష్టంచేశారు. కూటమిప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటే ప్రజలతో పాటు, రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్నంతో ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి ఎంతగానో తపన పడుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రభుత్వంపై.. చంద్రబాబు నాయకత్వంపై అసంతృప్తి లేకుండా అందరూ ఓర్పు సంయమనంతో ఆలోచించాలన్నారు. మానుకొండవారిపాలెం నాయకులు గట్టిగా వెంటపడి ప్రజల సమస్యతీర్చాలని పట్టుబట్టినందునే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. గ్రామంలోని మిగతా అభివృద్ధి పనుల్ని కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామన్నారు. గతంలో చేసిన మంచి చెప్పుకోలేకే ఓడిపోయాం చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలమయ్యే గతంలో టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు ప్రజలు వాస్తవాలు గ్రహించి ప్రభుత్వ పనితీరుపై తమ అభిప్రాయాలు చెప్పాల్సిందేనని ప్రత్తిపాటి చెప్పారు. తాను మంత్రిగా ఉన్నా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాళ్లు అరిగేలా తిరిగానన్న ప్రత్తిపాటి, ఐదేళ్లలో రూ.4,200కోట్లు ఖర్చుపెట్టి ప్రజలకు మంచి చేశానన్నారు. గతపాలకులు.. గత ప్రభుత్వం మరలా రాకూడదనే ధృఢచిత్తంతో ప్రజలు కూటమిప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. సుపరిపాలనలో కూటమిప్రభుత్వం తొలి అడుగు మాత్రమే వేసిందని, చంద్రబాబు.. పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రాన్ని, ప్రజల్ని కష్టాల నుంచి తప్పకుండా గట్టెక్కిస్తుందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు నాయకత్వంపై గట్టినమ్మకంతో ఉన్నారన్నారు. గ్రామాల్లోని ఎన్.ఆర్.ఐలు, వ్యాపారులు పీ-4లో భాగస్వాములై పేదల్ని ఆదుకోవాలని ప్రత్తిపాటి కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, షేక్ టీడీపీ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, కందుల రమణ, అంబటి సొంబాబు, కొండ్రగుంట్ల శ్రీను, బొంత దాసు, కట్టా వెంకటేశ్వర్లు, కందిమల్ల రాజేశ్వరి, కిల్లి వీర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.