Listen to this article

జనంన్యూస్ 11. నిజామాబాదు. రూరల్.

సహనం నశించిన లబ్ధిదారులు భూములపైకి వెళ్ళక తప్పదు

సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్.హేచ్చరించారు.

సిరికొండ 532 సర్వే నంబర్ భూముల సమస్యను పరిష్కరించకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని, హైకోర్టు ఆర్డర్ ఉన్న భూముల సమస్య పరిష్కరించకుండా రెవెన్యూ అటవీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సహనం నశించిన లబ్ధిదారులు భూములపైకి వెళ్లడం ఖాయం అని సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్.రమేష్. హేచ్చరించారు.శుక్రవారం నాడు సిరికొండలో లబ్ధిదారులతొ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్.రమేష్ మాట్లాడుతు: సిరికొండకు సంబంధించిన 532 సర్వేనెంబర్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. పట్టాలు ఇచ్చి 19సంవత్సరాలు అయినా నుండి అటవీశాఖ, రెవిన్యూ శాఖ అధికారులు లబ్ధిదారులను అడ్డుకుంటున్నారు అన్నారు. హైకోర్టు లబ్ధిదారులకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిన అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. భూమి మీదికి పోయినప్పుడల్లా అధికారులు హామీలు ఇవ్వడం, తర్వాత కాలయాపన చేయడం తప్ప పరిష్కారానికి పూనుకోవడం లేదన్నారు. సహనం నశించిన లబ్ధిదారులు ఇక భూములను చదును చేసే పనులు పెద్ద ఎత్తున చేపడతారని ఎవరు అడ్డుకున్నా ఈసారి ఆగేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తెచ్చిందని కానీ సమస్యల పరిష్కారంలో తాత్సారాం చేస్తుంది అన్నారు. సిరికొండకు సంబంధించిన ప్లాట్లు కూడా పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు అన్నారు. అధికారులు ఇలా ఉంటే ప్రజా ప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. సిరికొండ 532, ప్లాట్ల విషయం లో పోరాటడం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయి రెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, బి కిషోర్, ఎం. పండరి, ఎం. అశోక్, బి.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.