Listen to this article

జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ) సందర్భంగా అమలాపురం రూరల్ మండలం అధ్యక్షుడు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామంలో భక్తి సంకీర్తనాచార్య, గాన గంధర్వ, గాన ప్రమోద, సంగీత గురుశిఖామణి, సువర్ణ కంకణ, సువర్ణ రుద్రాక్ష మాల సన్మానితులు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ శ్రీ మట్టపర్తి చంద్ర శేఖర్ వారికి పళ్ళు, పూలు, గురుదక్షిణ మరియు దుస్సాలువాతో భాజపా జిల్లా కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయణ సత్కరించడం జరిగింది, ఈ కార్యక్రమానికి మండల ప్రధాన కార్యదర్శి బండి ఏసుబాబు, మండల కార్యదర్శి పేరూరి వెంకటేశ్వరరావు, మండల కోశాధికారి తటవర్తి వెంకట సుబ్బారావు, గురువు వారి శిష్యులు సింధు భైరవి, ఉషారాణి పాల్గొన్నారు..