

బిజెపి కొత్తగూడెం కమిటీ
జనం న్యూస్ 11జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం )
కొత్తగూడెం పట్టణ కమిటీ, ప్రధాన కార్యదర్శులు,గుంపుల మహేష్, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీజేపీ కార్యకర్తల గుండె చప్పుడు బండి సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 30 సంవత్సరాల నుండి బండి సంజయ్ తోటి ఉన్న అనుబంధాన్ని కార్యకర్తలకు వివరించారు నిబద్ధతతో పార్టీకి పనిచేస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని దానికి ఉదాహరణ బండి సంజయ్ ని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో- కన్వీనర్ జల్లారపు శ్రీనివాస్,సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ,జిల్లా నాయకులు ఆగుళ్ల వీరేశలింగం,పట్టణ ఉపాధ్యక్షుడు బానోత్ రాంబాబు నాయక్,పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గూడా విజయ, ఆకుల కృష్ణ,గోపి,రాజు,సుజాత, చంద్రశేఖర్, రమేష్ మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.