Listen to this article

జనం న్యూస్ జూలై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చనిపోయిన వారి ఇళ్ళకి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, జన సమూహం మధ్యలో ఉన్న కల్లు కాంపౌండ్లను మూసివేయాలి అని అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇరవై లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఈ ఘటనకు కారకులైనటువంటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు..అనంతరం కల్తీ కల్లు ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఆ కాంపౌండ్స్ ను నడిపిస్తుండడంతో వాటిపై చర్యలు తీసుకోవడం లేదని కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఘటన జరిగిన వెంటనే కల్లు కాంపౌండ్స్ అధికారులు తెలుపుతున్న తానే స్వయంగా కాంపౌండ్లోకి వెళ్ళామని ఎక్కడ సీజ్ చేశారో చూపించాలని ప్రశ్నించారు. ఇద్దరు మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప అండగా నిలవలేదని విమర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి అంబులెన్స్ లో బాధితులను తీసుకొని వెళితే వారు చేర్పించుకోక అటు ఇటు తిప్పడంతోనే పలువురు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. బాధితులకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో కలిసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమాలను చేపడతామని అన్నారు…ఈ కార్యక్రమములో మాజీ కార్పొరేటర్ రంగా రావు, ఎర్రబెల్లి సతీష్ రావు, సింగం శ్రీకాంత్, ఖలీమ్, వెంకటేష్ యాదవ్, షరీఫ్, నరసింగ రావు, శ్రీనివాస్, ఖదీర్ సుధాకర్ రెడ్డి, బాలరాజ్ , లక్సమం , శివ సాగర్ , ,జనార్దన్ రావు , నాగేశ్వర్ రావు , రాజు , నాగభూషణం , కళ్యాణ్ , శంకర్ గౌడ్ , రాములు గౌడ్ , , చంద్రశేఖర్ గౌడ్ , మహేందర్ రెడ్డి , వెంకటేశ్వర్ రావు , నర్సింహా , విష్ణు , లక్ష్మి , శ్యామల, సరస్వతి , నర్సమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు