Listen to this article

కొత్తగూడెం,జూలై 11 ( జనం న్యూస్)

మనం పత్రిక ఇంచార్జ్, జర్నలిస్ట్ జంపన్న సతీమణి జాడి మంజుల గత కొన్ని సంవత్సరాలనుండి గుండె, లివర్,సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మంజుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. అయితే హైదరాబాద్ లోని మహావీర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, డిచార్జ్ అయి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు తడికల శివ కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు కురిమెల్ల శంకర్ లు పరామర్శించారు ఉద్యమంలో అండగా ఉన్న వారేరి, ప్రజా ఉద్యమంలో, పార్టీలో, తోడుగా ఉన్నవారు ఎవరు.. నీకు ఆపద వస్తే ఆదుకునే వారెవరని బాధపడి, అలాగే ఉద్యమ విషయాలు గుర్తు చేసుకున్నారు. జంపన్న కూడా ఎంతో కష్టపడి కళాకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన సరైన గౌరవం దక్కలేదని, ఇప్పుడు జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి ఇకముందు అయినా అన్ని పరిస్థితులని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆశిస్తూ, మీ కుటుంబాన్ని అండగా బిఎస్పీ పార్టీ ఉంటుందని అన్నారు