

జనం న్యూస్ – జూలై11-
నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో డెంగ్యూ,మలేరియా నివారణ మాసోత్సవం లో భాగంగా శుక్రవారం విద్యార్థులకు డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ పాఠశాలలో జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. 20 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించగా సాధారణ జ్వరంగా నిర్ధారించి మందులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల వసతి గృహాల పరిసరాలను సందర్శించి పరిశీలించి అక్కడ సిబ్బందికి శానిటేషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి లత, నాగార్జునసాగర్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ సిబ్బంది లింగయ్య, గంగా బాయి, తిరుమల చారి, బీసీ గురుకుల పాఠశాల వైద్య సిబ్బంది నాగమణి,రజని తదితరులు పాల్గొన్నారు.