

జనం న్యూస్ 11- 7- 2025 అల్లాదుర్గ్
మండల్ జిల్లా మెదక్ నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీహెచ్సీ గడి పెద్దాపూర్ నందు ర్యాలీ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీమతి శ్రీ అశ్విని మేడం మాట్లాడుతూ భూమి పెరగలేదు, గాలి పెరగలేదు నీరు పెరగలేదు కానీ అడ్డు అదుపు లేకుండా చాప కింద నీరు లాగా శరవేగంతో పెరిగిపోతున్న జనాభాని కళ్లెం వెయ్యడమే సగటు భారతీయుడు, ముఖ్యంగా యువత ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది, మరియు సమాజంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, సమాజ గురువులు ఆలోచించవలసిన అవసరము ఉంది, బాధ్యత ఒక వైద్య ఆరోగ్యశాఖదే కాదు మనందరి భుజస్కందాల పైన ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేశారు. దంపతులు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలకు జన్మనివ్వాలి ఆరోగ్యమే ముద్దు అనేటటువంటి మాట గుర్తు చేశారు. దంపతులు సంతానాన్ని కనేటప్పుడు ప్రణాళిక బద్ధంగా ఉండాలని, ఒకటి ముద్దు రెండు హద్దుకు పరిమితం కావాలని ఒక సంతానానికి మరో సంతానానికి ఎడమ అవసరమని ఇది ఇలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఆర్థిక సమస్యలు ఉండవాని ఆరోగ్య సమస్యలు ఉండవని కుటుంబం చిన్న భిన్నం కాదని గుర్తు చేశారు. దేశ ప్రగతి అధోగతిని అంచనా వేయడానికి శిశు మరణాలు, స్త్రీ విద్య మూల ప్రమాణాలు అవుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విని,HEO దస్థిరం, సూపర్వైజర్లు నాగమణి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది రవీందర్, యాదమ్మ, అనిత, ఆశా వర్కర్ నిర్మల, సుశీల, సుశీల, ప్రజలు పాల్గొన్నారు.
