Listen to this article

. జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి సంగం

మండలంలోని కృష్ణా నగర్, గవిచర్లలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళాజాత నిర్వహించారు. వడ్డీ లేని రుణాలు, పాల డెయిరీ నిర్వహణ, సోలార్ ప్లాంటుల నిర్వహణ, మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు, ప్రమాద బీమా వంటి అంశాలపై కళాకారులు పాడిన పాటలు పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధునాతన కుట్టు మిషన్లు అందజేయగ, మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలు రాణిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు రవి యాదవ్, అనిల్, టిఎస్ఎస్ టీమ్ లీడర్ జూపాక శివ, రామంచ భరత్, అంకం రామనాథం, మరముల్ల ఆనందం, హింగే అరవింద్ కుమార్, ఏలబోయిన రాజు, ఇల్లందుల సతీష్, శాలిని, అనిత, హరిత, శ్రీలత, విజయ, ఝాన్సీ, సమ్మన్న, రామకృష్ణ, సీసీలు, వి ఓ లు, వీ వో ఏ లు,మహిళలు తదితరులు పాల్గొన్నారు…..