

జనంన్యూస్. 11.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత ఐదు ఆరు నెలల నుండి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ పరిధి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరుగుతూ నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని తాటిపల్లి జినియాల ఎల్లంకుంట చెరువు మరియు తాళ్లకుంట జినిగాల చెరువు ప్రాంతంలో తిరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఆర్మూర్ నుండి భవాని శంకర్ మరియు సిరికొండ కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి బి రవీందర్. మరియు అతని సిబ్బంది ఎనిమల్ రాకర్స్ ఎన్జీవో వెంకట్. అటవీ ప్రాంతంలోనికి వెళ్లి పరిశీలించగా పులి అడుగుజాడలను పరిశీలించి అది మగ పులిగా నిర్ధారణకు వచ్చినారు ఇదే పులి గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఏరియాలో సంచరిస్తుండేది ఇట్టి పులికి 512 గా నామకరణం చేసినారు కాబట్టి చుట్టుప్రక్కల సిరికొండ భీంగల్ కమ్మర్పల్లి మండల ప్రజలు పశువుల కాపరులు అడవికి దగ్గర్లో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని పులి యొక్క ఆనవాళ్లు కనిపించినచో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వవలసిందిగా మరియు రైతులు పొలాల చుట్టూ కరెంటు వైర్లు బిగించారాదని అటవీ శాఖ అధికారి తెలియజేశారు.ప్రతినిత్యం అటవీ ప్రాంతంలో అధికారులు మరియు అనిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు గస్తీ తిరుగుచున్నారు పులి యొక్క కదలికలను తెలుసుకుంటూ ఉంటారు ప్రజలు అప్రమత్తంగా ఉండి పులికి ఎటువంటి హాని కలిగించవద్దని రేంజ్ అధికారి రవీందర్ తెలిపారు.