Listen to this article

జనం న్యూస్- జనవరి 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ స్థానిక హిల్ కాలనీ లో వీధి కుక్కలు దాడిచేయడంతో మేకల యాజమాని వెంకన్న కు చెందిన ఒక 12 కిలోల మేకపిల్ల మృతి చెందింది. దీనితో తనకు 15 వేల వరకు నష్టం వచ్చిందనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక మున్సిపాలిటీ లో పిచ్చికుక్కలు వీధి కుక్కల స్వైర విహారం రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో పాఠశాల విద్యార్థులు స్కూలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో, ఇంటి ముందు ఆడుకుంటున్న సమయాలలో ఒకేసారి నలుగురు పై దాడి చేసి గాయపరిచాయి. నందికొండ మునిసిపాలిటీ గా ఏర్పడిన తరువాత వీధి కుక్కలు,పిచ్చికుక్కల నివారణ తగ్గి అవి పాఠశాలలు, మార్కెట్లు,వీధుల వెంబడి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా సంచరిస్తూ రాత్రి పగలు అని తేడా లేకుండా వచ్చి పోయే పాదాచారులు, ద్విచక్ర వాహన దారుల మీదికి వాహనాలను వెంబడిస్తూ గాయాలుపాలుచేస్తు న్నాయని వాటిని నిరోధించాలని కుక్కల బాధితులు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా వారు జంతు సంరక్షణచట్టాల గురించి చెబుతున్నారే తప్పా ఏవిధమైన శాఖపరమైన చర్యలుచేపట్టడం లేదని పలువురు కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . గత రెండు సంవత్సరాల క్రితం హారిక అనే చిన్నారిని పిచ్చికుక్కలు దాడి చేసి గాయపరచగా ఆ చిన్నారికి రాబిస్ వ్యాధి సోకి ఇప్పటికీ కోమాలో ఉండి మంచం మీద జీవచ్ఛవంలా పడి ప్రాణాలతో కొట్టు మిట్టడుతూఉంది. ఇలా గాయలపాలై మనిషి ప్రాణాలు పోతున్నా అధికారులలో చలనంలేదని కాలనీవాసులు భయాందోళనచెందుతున్నారు .ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేల్కొని కాలనీ వాసులు వీధి కుక్కల భారిన పడకుండా ప్రజల ప్రాణాలు
కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.