

జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌కు సంబంధించి రూ.6400 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మెరకు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరెట్ వద్ద శుక్రవారం మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీకి పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ఇవ్వాలన్నారు. పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే జీవో నంబర్ 77 రద్దు చేయాలన్నారు.