

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 12 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్‌లో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ మెడికల్ క్యాంప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా షేక్ రఫాని మాట్లాడుతూ, ప్రత్తిపాటి ఫౌండేషన్ పేద ప్రజల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి కంటి చూపును ప్రసాదించడమే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సైతం అందిస్తుందని కొనియాడారు. ఈ గొప్ప కార్యక్రమానికి కృషి చేస్తున్న మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరం ద్వారా అనేక మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చైర్మన్ రఫాని పేర్కొన్నారు.