Listen to this article

జనం న్యూస్ 12జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోటర్.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.. ఎంపీ రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ కి జైనూర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కుమరం భీం జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన పార్టీ సంస్థ గత పునర్నిర్మాణం సమావేశానికి వెళ్తూ మార్గమధ్య లో జైనూర్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కరచాలనం చేసి యోగ క్షేమాలను అడిగితెలుసుకున్నారు.ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ , ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ, పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖీద్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కనక ప్రతిభ, రాథోడ్ రాందాస్,మెస్రం భూపతి, కాంగ్రెస్ నాయకులు మెస్రం అంబాజీ, మండాడీ లింగు, ఆత్రం దత్తు, హైదర్, తుమ్రం కొటేష్,ఆత్రం యాదవ్ రావు, కృష్ణ, సాయం ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.