Listen to this article

(జనం న్యూస్ 12 జూన్ బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)

భూమి పెరగలేదు, గాలి పెరగలేదు నీరు పెరగలేదు కానీ అడ్డు అదుపు లేకుండా చాప కింద నీరు లాగా శరవేగంతో పెరిగిపోతున్న జనాభాని కళ్లెం వెయ్యడమే సగటు భారతీయుడు, ముఖ్యంగా యువత ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది, మరియు సమాజంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, సమాజ గురువులు ఆలోచించవలసిన అవసరము ఉంది, బాధ్యత ఒక వైద్య ఆరోగ్యశాఖదే కాదు మనందరి భుజస్కందాల పైన ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేశారు. దంపతులు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలకు జన్మనివ్వాలి ఆరోగ్యమే ముద్దు అనేటటువంటి మాట గుర్తు చేశారు. దంపతులు సంతానాన్ని కనేటప్పుడు ప్రణాళిక బద్ధంగా ఉండాలని, ఒకటి ముద్దు రెండు హద్దుకు పరిమితం కావాలని ఒక సంతానానికి మరో సంతానానికి ఎడమ అవసరమని ఇది ఇలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఆర్థిక సమస్యలు ఉండవాని ఆరోగ్య సమస్యలు ఉండవని కుటుంబం చిన్న భిన్నం కాదని గుర్తు చేశారు. దేశ ప్రగతి అధోగతిని అంచనా వేయడానికి శిశు మరణాలు, స్త్రీ విద్య మూల ప్రమాణాలు అవుతున్నాయి