Listen to this article

మెదక్ పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేశాం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్

జనం న్యూస్ 2025 జనవరి 25 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)

బావోద్యగల నడుమ అట్టహాసంగా ముగిసిన బల్దియా సమావేశం. కరోనా సమయంలో పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం అధికారులు సిబ్బంది కృషి అభినందనయ్యామని చైర్మన్ వైస్ కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం రోజున మెదక్ మున్సిపల్ అభినందన వీడ్కోలు సమావేశం బావోద్యగల నడుమ అట్టహాసంగా ముగిసింది. కౌన్సిలర్లు వార్డు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పొలిటికల్ లీడర్స్ కు రిటర్మెంట్ ఉండదని చైర్మన్ వైస్ ఛైర్మన్ తొడుపుణురి చంద్రపాల్ వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు.ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులను ప్రజలు గుండెల్లోపెట్టుకుంటారనిన్నారు.కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల సేవ గొప్పదనికమిషనర్ కక్ష్యసాధింపు ధోరణి వీడి అందరిని కలుకుపోవాలని సూచించారు.ఉద్యోగులకు మాత్రమే రిటైర్మెంట్ ఉంటుందని, ప్రజలకు సేవ చేసే పొలిటికల్ లీడర్స్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అన్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఐదెండ్ల పాటు పట్టణాభివృద్ధి కి కృషి చేసినట్లు తెలిపారు. రెండేళ్లు కరోనా తోనే గడిచిపోయిందన్నారు.పారిశుధ్య నివారణలో కార్మికుల కృషి ఎనలేనిదని అయన కొనియాడారు. అందరి సహకారంతో మెదక్ మున్సిపాలిటీ కి పలు అవార్డులు వచ్చాయన్నారు.కౌన్సిల్ పదవి ముగిసిన కౌన్సిలర్లు నిత్యం ప్రజల్లో ఉండి వారి మన్నలను పొందాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కక్ష్యసాధింపు ధోరణి వీడి అధికారులను సిబ్బంది ని కలుపుకొని పట్టణాభివృద్ధికి దోహదపడాలన్నారు.ఐదెండ్ల కౌన్సిల్ గడువు ముగిసినందున ఔట్ సోర్సింగ్ సిబ్బంది ని తొలగిస్తామని కమిషనర్ బెదిరింపులకు పాల్పడటం మంచిదికాదన్నారు. పొట్టకూటికోసం, కుటుంబ పోషణ కోసం కార్మికులు,సిబ్బంది పనిచేస్తున్నారని వారి శాపనార్దాలు మంచిది కాదన్నారు. కౌన్సిల్ సభ్యులు ప్రజా సమస్యలపై మున్సిపల్ ఆఫీసుకు వస్తుంటారని, వారి సమస్యలు విని పరిష్కారానికి కృషిచేయాలని అయన కోరారు. ప్రజల ఎజెండా నే పొలిటికల్ లీడర్స్ ఎజెండా అన్నారు. వారి సంక్షేమం కోసమే తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందరికి చూసే బృహత్తర బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ కృషి తో మెదక్ పట్టణాన్ని మరింతగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తనవంతు కృషిచేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లును సిబ్బందిని ఘనంగా సన్మానించారు.ఈ సమావేశం లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, కిషోర్, రాగి వనజ, సులోచన, బట్టి లలిత, సుంకయ్య, మమతా, లక్ష్మినారాయణ గౌడ్, వసంత్ రాజ్, జయరాజు, శమిసున్నిస్సా బేగం, గంగాధర్, అవారి శేఖర్, లింగం, సమీ తదితరులు పాల్గొన్నారు.