

(జనం న్యూస్ 12 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంనికి చెందిన భూపల్లి లస్మయ్య s/o లింగయ్య అను వ్యక్తి మద్యం సేవించి పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించి మరియు వారి యొక్క విధులకు ఆటంకం కలుగజేసిన విషయంపై భీమారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా శనివారం రోజున అతనిని చెన్నూర్ కోర్టు మేజిస్ట్రేట్ నందు హాజరు పరచగా ఆ వ్యక్తి నీ లక్షట్ పేట్ రిమాండ్ కి తరలించడం జరిగింది. ఎవరైనా మద్యం సేవించి పోలీస్ శాఖ వారితో దురుసుగా ప్రవర్తించడం, పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించడం చట్టవిరుద్ధం అని, అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగినది