

జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు పేర్కొన్నారు. శనివారం కొమానపల్లి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సాంకేతిక సమస్యలతో కొన్ని సంక్షేమ పథకాలు అమలులో జాప్యం జరుగుతుందని జాప్యం లేకుండా పథకాలు సకాలంలో అందే విధంగా చూడాలని కొంతమంది నరసింహారావు దృష్టికి తీసుకురాగా స్థానిక శాసనసభ్యులు బుచ్చి బాబుకి గ్రామంలో సమస్యలను తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నరసింహారావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు పి నారాయణ రావు బాలు గ్రామ కమిటీ అధ్యక్షులు కుంచనపల్లి వెంకన్న బాబు పి కృష్ణ వర్మ కుంచనపల్లి నారాయణ మారెళ్ల శ్రీనివాసరావు మంగ శ్రీనివాసరావు షేక్ సుభాన్ ఇల్ల సత్తిబాబు ముమ్మిడివరం వరలక్ష్మి మొల్లి చిన్న నాగరాజు మట్ట ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు