

జనం న్యూస్ జులై 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు చలి వాగు చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు ఈ ఘటన మండలం లోని కొప్పుల జరిగింది అని ఎస్సై జక్కుల పరమేష్ కథనం ప్రకారం మండలం లోని కొప్పుల గ్రామానికి చెందిన బండి భాస్కర్ వయసు 45 సంవత్సరాలు శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని చలి వాగు ప్రాజెక్టులోకి చేప వేటకు వెళ్ళాడు చేపలు పడుతుంన్న క్రమంలో ప్రమాద శాతు డ్యాంలో పడి నీట మునిగాడు గమనించిన సహ మత్స్యకార్మికుడు పి కిరణ్ భాస్కర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు హుటాహుటిన కుటుంబ సభ్యులు చలి వాగు వద్ద కు చేరుకుని చూడగా అప్పటికే భాస్కర్ నీటీలో మునిగి మృతి చెంది ఉన్నాడు మృతిడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేష్ తెలిపారు…..