

జనం న్యూస్,జులై 13,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో ముత్యాల పోచమ్మ అమ్మకి ఆదివారం ఘనంగా ఆషాడ మాసం బోనాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ.ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి,చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.బోనాలతో ప్రదక్షిణాలు చేస్తున్న మహిళలు అధికారిక పేరు బోనాలు జరుపుకొనేవారు. తెలంగాణా ప్రజలు ప్రారంభం ఆషాడ మాసం ఉత్సవాలు ఆదివారాలు జరుగుతాయి ఆవృత్తి సంవత్సరానికి ఒకసారి
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో,పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.