

ఎస్ ఐ,కే,శ్వేత
(జనం న్యూస్ 14జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
సోషల్ మీడియా ప్రచారాల పట్ల మండల ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండాలని,సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, భీమారం మండల ఎస్ ఐ, కే శ్వేత హెచ్చరించారు.ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ..యువత సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.వాట్సాప్, ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్,ఎక్స్ తదితర సామజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచేలా, రెచ్చగొట్టేలా,అవమానకర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేలా ప్రోత్సహించడం, సహకరించడం,కుట్ర చేయడం వంటివి కూడా చట్టరీత్యా నేరమని తెలిపారు. గ్రూపుల్లో అడ్మిన్లు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. యువత అనవరమైన చిక్కుల్లో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఎస్ ఐ మండల యువతకు సూచించారు.