

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 25 :- మండల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశం నిర్వహించరు.ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య మాట్లాడుతూ పాఠశాలకు రాని విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చేలా చూడాలని, 10వ తరగతి విద్యార్థులు ఉదయం సాయంత్రం క్లాసులకు తప్పనిసరిగా హాజరు అయ్యేలా చూడాలని తల్లిదండ్రులు కోరడం జరిగింది. సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జి వెంకటలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు