

జనం న్యూస్ 13 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో వైభవోపేతంగా సాగుతున్న మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. . ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. తెలంగాణలో బోనాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, దేవతలను పూజించేందుకు బోనం ఎత్తే భక్తి శ్రద్ధలతో సంప్రదాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉందని తెలిపారు. మహంకాళీ అమ్మవారి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, గట్లకానిపర్తి గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలని, గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు తన వంతుగా సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…