

జనం న్యూస్ జూలై 13 సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు మండలం పాష మైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమ ఘటన మరువకముందే పాశ మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ పరిశ్రమలో టైర్ల కు సంబంధించిన రీసైక్లింగ్ పరిశ్రమగా తెలుస్తుంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను రెండు ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణాలు నష్టం జరగలేదు. పారిశ్రామిక ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
