

జనం న్యూస్ జులై 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
హైదరాబాద్ యుసిసిఆర్ఐ(యం.యల్)ముఖ్య (రాష్ట్ర) నాయకులు కామ్రేడ్ శిష్ట్లా విజయ్(శర్మ)74 మృతి భారత విప్లవద్యమానికే తీరని లోటు అని సిపిఐ(మాస్ లైన్) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం ఆదివారం రోజు పంపిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతి కి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చాలాకాలంగా కిడ్నీ వ్యాదితో గత కొద్ది రోజులుగా డయాల్సి స్ తో బాదపడుతూ 2025, జూలై-12, రాత్రి 9 గంటలకు తన చివరి శ్వాస నొదిలారని. గుర్తుుచేశారు.
ఎందరో వృత్తి విప్లవకారులు గా తీర్చి దిద్దిన ఫలితంగా నేడు తను కూడ విప్లవ రాజ కీయాల్లో కొనసాగడానికి కారణం అయ్యారని అన్నారు. తనకు ఆయన తన మొదటి రాజకీయ గురువుగా గడ్డం సదానందం ప్రకటించారు. సిద్దాంత రాజకీయ బోదనలు, ఆయన నిర్మాణ కృషి, విప్లవ ఆకాంక్ష, భారత జనతా ప్రజా తంత్ర విప్లవానికై ఆయన త్యాగం హిమాలయాల కంటే ఉన్నత మైనదని కొనియాడా రు. విజయ్ సార్ విప్లవ కృషికి రెడ్ సెల్యూట్, లాలాసలాం తెలి య జేస్తున్నామని అన్నారు. ఆయన బోధించిన విప్లవ నైతిక విలువలను జీవిత కాలమంతా పాటిస్తామని ఈ సందర్భంగా ప్రతినబూనారు. అది కామ్రేడ్ విజయ్ కి తను అందించే వినమ్ర అశ్రునివాళి అని తెలియజేస్తూ బావోద్వే కి గురయ్యారు. తన 16వ యేట (1990) నుండి 2017 వరకు తల్లి తండ్రులనూ, కుటుంబాలను మరిపించిన విజయ్ లాంటి పీడిత వర్గాల ప్రతినిధి ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానంను బోదిం చి, దానిని భారత నిర్ధిష్ట పరి స్థితులకు ఎలా అప్లై చేసు కోవాలో, పార్టీ నిర్మాణం, ఐక్య సంఘటణ, ఎత్తుగడలను రంగరించి పోసి, వివిధ రంగాల ప్రజలను ఎలా ఆర్గనైజ్ చేయా లో ముఖ్యంగా కార్మిక వర్గంలో ఎలా పని చేయాలో, బలపం పట్టి నేర్పించిన తమ విప్లవ గురువు అస్తమించాడని తెలిసాక జీర్ణం చేసుకోవడానికి కష్టంగా ఉందని సదానందం తన మనోవేదనను, బాదను పత్రిక ముఖంగా తెలియ జేశారు. ఆయన ఆశయాల సాధనకై చివరికంటా కృషి సల్పుతామని, అదే కామ్రేడ్ విజయ్ తమ నుండి కోరు కున్నారని గుర్తుచేశారు. దాన్ని నిజాయితీగా అమలు జరుప టమే తమ ముందున్న కర్తవ్యం అని,సూర్యచంద్రులు ఉన్నంత వరకూ ఈ సృష్టి నడిచినంత వరకు, పీడిత తాడిత ప్రజా నీకానికి ముఖ్యంగా కార్మిక వర్గానికి వేగుచుక్కై దారి చూపుతాయని కొనియాడా రు. బ్రాహ్మణోత్తముల కడుపున జన్మించి, రాడికల్ హ్యూమని స్ట్ గా మారి, అనంతరం కమ్యూనిస్టు విప్లవ కారుడిగా మారిన కామ్రేడ్ ఎస్.వి.ఎస్. తమ్ముడిగా ఆయన ద్వారా మహత్తర తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం (1946 -51) కు నాయకత్వం వహిం చిన భారత విప్లవోద్యమ నాయకులు అమరులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వ రరావు (డివి), సహచర కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టి.యన్)ల రాజకీయాలతో ప్రేరణ పొందిన విజయ్ సార్, యుసిసిఆర్ఐ (యం.యల్) నాయకుడు కామ్రేడ్ బాస్కర్ అయ్యర్ తో కలిసి, కేంద్ర ప్రభుత్వ ఎన్.ఎఫ్.సి కొలువు ను విడిచిపెట్టి, కమ్యునిస్టు విప్లవ జీవితాన్ని ఎంచుకుని సమ సమాజ స్థాపనకై,వృత్తి విప్లవకారుడిగా మారాడని అన్నారు. డివి- టియన్ లు మరణించిన జూలై మాసం లోనే, అదీకూడా జూలై 12 నే తన చివరి శ్వాస నొందారని గుర్తుచేశారు. రహస్య జీవితం గడుపుతున్న విజయ్ బ్రాహ్మణోత్తముడని, ఆయన తన బ్రాహ్మణీయ బావజాలంలోని అంటరాని తనం, అస్పృశ్యతలను ఏవగించుకొని, ఆదిపత్యపు, విషపూరిత, దోపిడీ పూరిత, మోసపూరిత దుర్మార్గాలపై చివరికంటా పోరాడి, స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమని చాటిన గొప్ప నాయకుడని అన్నారు. అయన ఒక కరుడు గట్టిన కమ్యునిస్టు విప్లవ కారుడిగా, కఠినమైన కమ్యూనిస్టు విప్లవ జీవన విదానాన్ని ఆచరించి, ఎందరికో ఆదర్శంగా నిలిచార ని కొనియాడారు. కామ్రేడ్ విజయ్ ఎన్నో నిర్భం దాలను, ఆటుపోట్లను, చిత్ర హింసలను బరించి, చావు అంచలదాక వెళ్ళి వచ్చారని, విప్లవం పట్ల గల అకాంక్షా దీక్ష యే అతన్ని మామూలుగా మార్చాయని, అది అయన విప్లవ రాజకీయ సిద్దాంత బలమేనని స్పష్టం చేశారు. ఆయన విడిచి వెళ్ళిన ఆశ యాలను తుదికంఠా కొనసాగి స్తామని తెలియజేస్తూ గడ్డం సదానందం విప్లవ జోహార్లు అర్పించారు. నాగోల్ బండ్లగూడ కరెంట్ స్మశాన వాటికలో కామ్రేడ్ విజయ్ అంత్య క్రియలు అమరవీరుల ఆశయాలను కొనస్తాం,అమర్ హై కామ్రేడ్ విజయ్ సార్ అనే విప్లవ నినాదాల హోరుతో ఘణంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ,వివిధ ప్రజా సంఘాల నాయకులు కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….