Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 14 రిపోర్టర్ సలికినీడి నాగు

జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి శ్రేష్ట పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన సభ తిరుపతిలో ఆదివారం జరిగింది. ఈ సభలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన చౌటపల్లి లోకేష్ 53 ర్యాంకు సాధించినందుకు గాను తిరుపతి డిప్యూటీ కలెక్టర్ కోట రోజ్మండ్ మరియు వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్. సలికినీడి కిషోర్ గార్ల చే విద్యార్థికి ప్రశంస పత్రం జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ శ్రేష్ట లాంటి పథకాలను పేద విద్యార్థుల ఉపయోగించుకొని తమ లక్ష్యాలు కనుగుణంగా చదువును కొనసాగిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలియజేశారు. ప్రొఫెసర్ కిషోర్ మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన లోకేష్ జాతీయ స్థాయిలో 53వ ర్యాంకు సాధించడం తమ గ్రామానికి గర్వకారణం అని ఇలాంటి విద్యార్థుల విద్యాభివృద్ధికి తాము ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రేష్ట ప్రసాద్ EEE వ్యవస్థాపకులు పల్లె పోగు రవి రాజు బొంత పృథ్వీరాజ్, చౌటపల్లి మరియు దాసు, బొమ్మి బాబు వ్యాసాలకు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.