Listen to this article

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్ట్ బెజ్జరపు శ్రీనివాస్)

జనం న్యూస్, జులై 14, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల కేంద్రoలోని గంగపుత్ర సంఘానికి నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిదుల నుండి 4లక్షల ప్రొసీడ్ కాపీని సంఘ సభ్యులకు అందజేసిన ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ నిజామాబాదు ఎంపీ అరవింద్ ఇబ్రహీంపట్నం మండలం మీద స్పెషల్ ఫోకస్ పెట్టడని జడ్పీటీసీ,ఎంపీపీ,స్థానం లను గెలిపించి తిరుతనని అన్నారని ఎంపీ నిదుల నుండి మరి కొన్ని నిధులు మండలానికి మంజూరు చేస్తానని అన్నారని ఇబ్రహీంపట్నం మండలం లో ఈసారి బీజేపీ అవకాశం కల్పించాలని మండల ప్రజలను కోరుతునమని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పంతంగి వెంకటేష్, బీజేపీ నాయకులు మహేందర్, గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు.