

జనం న్యూస్ జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆషాడ మాసం ఆదివారం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి మహిళలంతా కలిసి అమ్మవారికి పుట్టింటి సారి ను సమర్పించడం జరిగింది. ఆషాడ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ మరియు గాజులు చలివిడి పానకాలు వివిధ రకాల తీపి పదార్థాలు అమ్మవారి ఆలయానికి విచ్చేసి గ్రామాల్లో ఉన్న మహిళలంతా కలిసి సామూహికంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం భక్తుల యొక్క గోత్ర నామాలతో నిర్వహించడం జరిగింది. ఈ పూజ అనంతరం మహిళలు అంతా కలిసి సామూహికంగా వారి తెచ్చినటువంటి ప్రసాదాలను ఒకరికి ఒకరు పంచిపెట్టుకుని పసుపు కుంకుమ లు మరియు గాజులు పంచిపెట్టి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఆణివీళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, గ్రంధి రాంప్రసాద్, పవన్ కుమార్, బాల వాసు, ఆకొండి శేషు, శంకర శాస్త్రి, కిరణ్, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

