Listen to this article


జనం న్యూస్ జూలై(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం

నూతనకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్నమల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఖబర్దార్ అంటూ మాట్లాడుతున్నారు అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినది మీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలు 420 హామీలు అమలు చేయమని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ప్రశ్నిస్తే నియోజకవర్గంలో నిన్ను తిరగనియం అని మాట్లాడుతున్నారు నువ్వు రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్గా ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. గాదరి కిషోర్ కుమార్ పై సంవత్సరాలు పూర్తి నియోగం అన్ని విధంగా అభివృద్ధి చేశాడు తుంగతుర్తి లో వంద పడకల హాస్పిటల్ మా నాయకుడు కాదా కట్టించింది నూతనకల్లులో 132 కెవి సబ్ స్టేషన్ ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా నాయకుడు చేసింది అని అన్నారు. గతంలో బీడి భూములు అడవివాళ్ళే ఎడారి లెక్క మారిన తుంగతుని కాలేశ్వరం నీళ్లతో తుంగతుర్తి నియోజకవర్గానికి 8 సంవత్సరాలు నీళ్లు తీసుకువచ్చిరెండు పంటలు పంటలు పండించి రైతులకళ్ళలో సంతోషం మా నాయకుడు కిషోర్ కుమార్ చూశాడు అని అన్నాడు. రైతులకు 24 గంటల కరెంటు కాలేశ్వరం నీళ్లు రైతు రుణమాఫీ చేసింది మా నాయకుడు కేసీఆర్ మీరు అధికరణకు వచ్చి 20 నెలల కాలంలో మీరు చేసినది ఏమి లేదు తుంగతుర్తిలో 20 నెలల నుండి ఎక్కడ వేసిన గొంగిడి అక్కడే అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది మా ప్రభుత్వంలో మేము కట్టించిన బిల్డింగులు రోడ్లు సంక్షేమ కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు వేసిన ప్లేట్లు శిలాఫలకాలను కొలగొట్టడం తప్ప భూ దందాలు ఇసుక దందాలు చేయడం తప్ప మీరు చేసినవి ఏమీ లేవు అక్రమ కేసులు పెట్టడం తప్ప ప్రతిలో శూన్యం మా నాయకుడు అడిగిన కాలేశ్వరం నీళ్లు తుంగతుర్తి నియోజకవర్గానికి తెప్పించండి. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్ మండల సీనియర్ నాయకులు లింగరాజు,రేస్ వెంకటేశ్వర్లు మొగుల వెంకన్న,కనకటి మహేష్ విజయ్,శ్రీశైలం,రవీందర్ రెడ్డి, యాకయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.