

జనం న్యూస్. జనవరి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- కామారెడ్డి జిల్లా బికునూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ తండ్రి శంకరయ్య వయసు 42 సంవత్సరాల గల వ్యక్తి గత మూడు సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం హత్నూర మండలంలోని రెడ్డి ఖానాపూర్ గ్రామంలో గల ఒక అద్దె ఇంట్లో కిరాయకుంటూ అక్కడే ఎఫ్ పీ ఓ ఆఫీసులో సీఈవోగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు, ఈనెల 24 రాత్రి 9 గంటల సమయంలో బోర్పట్ల గ్రామంలో ఒక బీరు తీసుకొని వస్తానని చెప్పి రూమ్ నుండి తన యొక్క ఫ్యాషన్ ప్రో బైక్ ను తీసుకొని వెళ్లగా మళ్లీ తిరిగి రాకపోవడంతో బంధువులకు చుట్టుపక్కల వారికి అడిగిన ఆచూకీ దొరకపోవడంతో నారాయణ భార్య మల్లె లక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ,భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు,