

జనం న్యూస్ జూలై 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాల సంబంధిత ఫిర్యాదులు ప్రధానంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పత్రిక సమావేశంలో తెలిపారు. ఈ వేదికలో పాల్గొని ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా చర్చించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ , సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన పరిష్కారం అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తక్షణ న్యాయం అందించడం పోలీసులు యొక్క ప్రధాన బాధ్యత. ప్రతి ఫిర్యాదును న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు,” అని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.//