

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నందికొండ బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
జనం న్యూస్ – జులై 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
తెలంగాణ ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించనున్న నేపథ్యంలో నందికొండ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ నాయకుడు హీరకర్ రమేష్ జి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు, అరెస్టు అయిన వారిలో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి, సభావత్ చంద్రమౌళి నాయక్, మూడవత్ లక్ష్మణ్ నాయక్, గాజుల రాము, రామస్వామి, పిట్ట సైదులు తదితరులు ఉన్నారు.