Listen to this article

జనం న్యూస్ జూలై 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలకేంద్రంలోపల్లె దవాఖానా భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి, స్థలానికి సంభందించిన పత్రాలను స్థానికి వైద్య సిబ్బందికి అంద జేసినట్లు స్థానిక గ్రామాభివృద్ధి కమిటి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామం లో పల్లె దవాఖానా భవనం లేక వైద్య సిబ్బందికి, గ్రామస్థులకు ఇబ్బంది ఎదురావ్వాడంతో పల్లె భవనం నిర్మాణానికి స్థలం కేటాయించి నట్లు అయన తెలిపారు. వైద్య సిబ్బంది గ్రామాభివృద్ధి కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానికగ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారి జూంగల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏట్టెం అరుణ్ యాదవ్, సభ్యులు ముస్కు మోహన్, కొలిప్యాక రాజేందర్, ఇరపట్నం నర్సయ్య, నరేష్, అశోక్, అభి, అన్వార్, ఊసన్న, వైద్య సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.