Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 14 రిపోర్టర్ సలికినీడి నాగు

జూలై 14.చిలకలూరిపేట ఏఆర్టీ కేంద్రాన్ని ఏపీసాక్స్ సీఎస్టి జాయింట్ డైరెక్టర్ డీఆర్.అంకినీడు ప్రసాద్ సోమవారం ఉదయం పల్నాడు జిల్లా దిశా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానిభాష తో కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్టీ కేంద్రం లో పలు రికార్డ్స్ ను పరిశీలించడం జరిగింది.అంతేకాకుండా ఏఆర్టీ కేంద్రం లో ఉద్యోగులతో మాట్లాడి తగు సూచనలు చేయడం జరిగింది.అంతేకాకుండా గత మాసపు నెలవారి రిపోర్ట్స్ ని పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీ సమయంలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానిభాష,ఐసీటీసీ కౌన్సిలర్ హనుమంత రావు మరియు ల్యాబ్టెక్నీషియన్ వంశీ,ఏ ఆర్టీ సిబ్బంది తో పాటు సీఎస్సీ 2.ఓ పీసీ ఉస్మాన్,స్థానిక టీ ఐ ఎన్జీఓ ప్రాజెక్టర్ మేనేజర్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది.