

జనం న్యూస్ జూలై 14 అమలాపురం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ పచ్చిగోళ్ళ జనార్దన్ రావు కళ్యాణ మండపం, శ్రీ కొల్లూరి సత్యనారాయణమూర్తి ఉన్నయ్య మినీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళం శ్రీఘాకోళపు శివ రామ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు వివిధ విభాగాలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల బాబి, కార్యదర్శి కుసుమంచి పాపారావు, కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్, మెడికల్ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు కృష్ణారావు, వంకాయల కాశి, పోశెట్టి సూరిబాబు, లక్కీ శెట్టి బాబులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి యెoదూరి సీతామహాలక్ష్మి, కొమ్మూరి ప్రసాద్ నంబూరి నరేష్, యెoడూరి వేంకట్రామయ్యలు ప్రారంభించగా వందలాదిమంది వారి ఆరోగ్య రక్షణకై పరీక్షలు నిర్వహించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు పల్లపోతు బంగారం, కోరుప్రోలు వేంకటేశ్వరరావు నంబూరి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు…. ఈ శిబిరంలో వెరీ కోర్స్ వీన్స్, గుండె, ఆర్థోపెటి,క్ గ్యాస్ట్రో, స్కిన్, డెంటల్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్ వంటి వైద్య విభాగాలకు సంబంధించిన వైద్య నిపుణులు పరీక్షలు చేసి వారికి అవసరమైన ఈసీజీ, ఏకో, యెoడూరీ రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్త సేకరణ గ్రూపు నిర్ధారణ వంటి పరీక్షలు చేసి మందులు వ్రాయగా సుమారు మూడు లక్షల రూపాయలు విలువైన మందులను సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన
ఈ మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వరదా సూరిబాబు, గ్రంధి నానాజీ, వారణాసి గుప్తా, కాళ్ళకూరి కుమార్, పచ్చిగోల్ల సోమరాజు, నూలు కృష్ణ, గ్రంధి గుప్త, సుగ్గు గోపి వెస్సా దృవ రాజారావు, అమలాపురం ఆర్య వైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు, కార్యదర్శి నూలు సూర్య ప్రభాకర్ రావు (సూరిబాబు) కోశాధికారి శ్రీకాకోళపు రాంపండు తదితరులు పాల్గొని వారి సేవలను అందించారు.
