

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలి….
ఓటు వేయటం పౌరులు బాధ్యతగా భావించాలి……
ప్రజాస్వామ్యం లో ప్రధాని నుండి వార్డు మెంబర్ వరకు ఎన్నుకునే అవకాశం పౌరులకి ఉంది……
15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహణ …..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…
జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ఓటు హక్కు అనేది పౌరులకి రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించిన 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికలలో ఓటు వేయటం బాధ్యతగా భావించి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు.
పార్లమెంట్ ద్వారా కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసేందుకు పార్లమెంట్ సభ్యులను ,శాసన సభ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసుకునేందుకు రాష్ట్ర శాసన సభ్యులని ఎన్నుకుంటామని తెలిపారు. భారతదేశం లో 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ అనే మూడు అంచేలా వ్యవస్థ ,అలాగే 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాల్టీ వ్యవస్థ ఏర్పాటు చేయటం జరిగిందని ప్రధానమంత్రి నుండి వార్డు మెంబర్ వరకు ఉన్న ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత రాజ్యాంగం 326 వ అధికరణ ద్వారా పౌరులకి ఓటు హక్కు కల్పించటం జరిగిందని, బ్రిటిష్ పాలిత భారతదేశం లో కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేదని తదుపరి స్వతంత్ర భారతదేశం లో 21 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని,1988 వ సంవత్సరం లో 61 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు ని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కల్పించటం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకుంటే బూత్ లెవల్ లో బి యల్ ఓ పరిశీలించి ఆమోదం కొరకు ఎ ఈ ఆర్ ఓ (తహసీల్దార్) కి పంపటం జరుగుతుందని,తదుపరి ఎ ఈ ఆర్ ఓ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఆర్ ఓ (ఆర్డీఓ )ఓటు హక్కు కల్పించి ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసి ఎన్నికలలో ఓటు వేసే అవకాశం కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు.జిల్లా స్థాయి లో ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఈ వి యం ల ద్వారా, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని 2023 నవంబర్ లో రాష్ట్ర శాసన సభ సభ్యుల ఎన్నికలు జరిగాయని అప్పుడు జిల్లాలో 86 శాతం పోలింగ్ నమోదు అయినది కానీ తదుపరి 2024 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో 74 శాతమే నమోదు అయిందని తెలిపారు.పౌరులు ఓటు వేయటం అప్షన్ లాగా కాకుండా బాధ్యతగా భావించి కుల, మతాలకు అతీతంగా నిస్పక్షపాతంగా పాలకులను ఎన్నుకోవాలని కలెక్టర్ సూచించారు.గ్రామీణ ప్రాంతాలలో అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రజలు ప్రతి ఎన్నికలో ఓటు వేస్తున్నారు కానీ అర్బన్ ప్రాంతంలో అక్షరాస్యత ఎక్కువ ఉన్న ఓటింగ్ శాతం మాత్రం తక్కువ నమోదు అవుతుందని, పౌరులకు ఎక్కువ అవగాహన కల్పించి ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి పోలింగ్ శాతం ని పెంచాలని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు ప్రతి ఒక్కరిచే కలెక్టర్ ఎన్నికల ప్రతిజ్ఞ చదివించారు.తదుపరి కలెక్టర్ కొత్త ఓటర్ కార్డులు యువతకి అందజేశారు అలాగే సీనియర్ సిటిజన్స్ ని, భవిత కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి లను సన్మానించారు. బెస్ట్ ఈ ఆర్ ఓ గా విధులు నిర్వహించిన హుజూర్నగర్ ఆర్ డి ఓ శ్రీనివాసులు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ లకి, ఎలక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాస్ రాజ్ కి అలాగే ఎ ఈ ఆర్ ఓ లుగా విధులు నిర్వహించిన సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, హుజూర్నగర్ తహసీల్దార్ నాగర్జన రెడ్డి, ఎలక్షన్ డి టిలు కోదాడ డిటి సుధారాణి, హుజూర్నగర్ డిటి కమలాకర్, తుంగతుర్తి డిటి కంట్లమయ్య లకు, బెస్ట్ బి యల్ ఓ గా సూర్యాపేట 109 పోలింగ్ కేంద్రం బి యల్ ఓ బంగారు పద్మ కి కలెక్టర్ మెమెంటో అందజేశారు. ఎలక్షన్ ఆపరేటర్ లుగా విధులు నిర్వహించిన 11 మందికి,20 మంది బి యల్ ఓ లకు కలెక్టర్ సర్టిపికెట్ లు అందజేశారు.
ఈ కార్యక్రమం లో ఆర్డీఓ లు శ్రీనివాస్ లు, సూర్యనారాయణ, వేణుమాధవ్,ఎలక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాసరాజు, డి టి వేణు,తహసీల్దార్ లు, నాయబ్ తహసీల్దార్ లు,ఎలక్షన్ ఆపరేటర్లు, బి యల్ ఓ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సీనియర్ సిటిజెన్స్,భవిత కాలేజీ విద్యార్థులు,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.