Listen to this article

జనం న్యూస్,జూలై14,అచ్యుతాపురం:


ఈరోజు హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కొండకర్ల ఎంపీపీ స్కూల్లో పిల్లలకు ఫ్లోరోసిస్ వ్యాధిపై జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ ఏ విశ్వనాథ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో చిరుతిళ్ళైన లేస్, కురుకురే, పానీ పూరి, నూడిల్స్, టూత్ పేస్ట్ తినడం లాంటివి వాటి వలన ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని వాటికి తినరాదని అదేవిధంగా పెద్దవాళ్లలో ఖైని, పాన్ పరాగ్, గుట్కా వంటి పొగా ఉత్పత్తులు తినడం వల్ల కూడా ఫ్లోరోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఇది ముఖ్యంగా దంతాలకు, ఎముకులకు వచ్చే అవకాశం ఎక్కువ అని వాటిని ముందుగా గుర్తించి తగి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్లో పిల్లలకు దంత పరీక్షలు నిర్వహించి అనుమానితులకు విటమిన్ సి మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు అరుణ జ్యోతి, ప్రోత్సాహిని, షాన్వాజ్, వైద్య సిబ్బంది మంగ, లక్ష్మి ,శ్రీదేవి, శేషారత్నం తదితరులు పాల్గొన్నారు