Listen to this article

జనం న్యూస్ జూలై 15 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని. సోమవారం మునగాల మండల కేంద్రంలో ఆవిష్కరించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు బహుజన ప్రజాసంఘాల బాధ్యులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…బీసీల కవితాత్మక తాత్విక నినాదమే బహుజన గణ మన అని,అందరూ ఏకం కావాలనీ గౌరీ శంకర్ దీర్ఘ కవిత ద్వారా పిలుపునిచ్చారన్నారు.ఇది జ్ఞాన యుద్ధం అని,సమన్యాయం కోసం చేసే పోరాటమని,బీసీలకు రాజ్యాధికారం లక్ష్యమే ప్రధాన అంశంగా ఈ దీర్ఘ కవిత కొనసాగిందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు,బహుజన ప్రజాసంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.