

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎద్దుల విజయ సాగర్, పత్రిక ముఖంగా వారిని డిమాండ్ చేయడం జరిగింది విజయసాగర్ మాట్లాడుతూ కడప నుండి తిరుపతి వెళ్ళే రోడ్డు మార్గంలో ఇతర రాష్ట్రాలు నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి.ఇతర రాష్ట్రాల నుండి తిరుమల దర్శనానికి ఈ రోడ్డు మార్గం ద్వారా భక్తులు ప్రయాణం చేస్తుంటారు ఇదే మార్గం లో చెన్నై ఎయిర్పోర్ట్ నుండి నిత్యం గల్ఫ్ కార్మికులు,పెద్ద పెద్ద లారీలు,కంటైనర్లు పోర్టు నుంచి రావడం,పోవడము నిత్యం సెకండ్ కు ఒక వెహికల్ కనబడుతుంది దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఈ రోడ్డు,వేల టాక్సీ డ్రైవర్ లు.ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు. నిన్న రెడ్డి పల్లె చెరువు కట్ట మీద జరిగిన ప్రమాదం డ్రైవర్ అతి వేగం ఒక కారణం అయితే,అస్తవ్యస్థ రోడ్డు మరో కారణం.ఈ రోడ్డు మార్గంలో నిత్యం జరిగే ప్రమాదాల్లోవేంకటేశ్వర స్వామి భక్తులు,గల్ఫ్ కార్మికులు వైద్యం కోసం తిరుపతికు వెళ్ళే ప్రజలు, చదువు కోసం ప్రయాణం చేసే విద్యార్థులు ప్రాణాలు కోల్పో తున్నారు.ఈ రోడ్డు మార్గం లో సురక్షిత ప్రయాణం కోసం పటిష్ట భద్రత చర్యలు వెంటనే తీసుకొవాలి రోడ్ సేఫ్టీ కమిటీ పర్యటించి శాస్వత పరిస్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ నేషనల్ హైవే అని పేరు పెట్టి ఈ నేషనల్ హైవే కి సంబంధించిన అధికారుల అడ్రస్లు వాటి వివరాలు ఎవరికి కనబడరు ఎవరికి చెప్పాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్య, ప్రతి ఒక్కరికి నాలెడ్జి ఉంది, కానీ ఈ నేషనల్ హైవే వాళ్ళని ఎవరు కనిపెట్టకుండా ఉన్నారు,వారు ఎప్పుడైనా అధికారులు ఒక ప్రెస్ మీట్ అయినా ఏది కూడా ప్రజలకే ఒక ట్రాన్స్పరెంట్ లేదు, అగోమచర్యంగా ఉంది జనాలకి ప్రతిరోజు మనము ఈ రోడ్డులో శవాలుగా మారు తున్నారు కుటుంబాల అనాధలుగా మారుతున్నాయి దీనికి ఎవరు కారకులు ఏమి అర్థం కావడం లేదు,ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి ఇంజనీర్ నెంబర్లు డిస్ప్లచేయాలి ప్రజలకి తెలియాలి.ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే ప్రజలు కట్టే టాక్స్లు రోడ్ టాక్స్ లు జిఎస్టి లో ఇవన్నీ ప్రజల భారం మీద పడుతున్న సందర్భంలో వీళ్ళ అడ్రస్ గల్లంతయ్యి తిరుగుతున్నారు నేషనల్ హైవే వాళ్ళు ఆచూకీ తెలపండి ప్రజలకి న్యాయం చేయాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాము. కడప నుండి తిరుపతి వరకు కొత్త రోడ్డు గురించి ప్రెస్ మీట్ పెట్టాలి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏ పొజిషన్లో ఏ స్టేజిలో ఉంది అనేది ప్రజలకు తెలియాలి ఈ అధికారులు నిమ్మకు నీరట్టుగా ఉంది వీరి కుటుంబ సభ్యులు కూడా ప్రయాణాలు చేస్తుంటారు వారు గమనించాలి.జీతాలు తీసుకుంటూ ప్రజల జీవితాలను చెలగాటము ఆడుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు,ఈ నేషనల్ హైవే రోడ్స్ అథారిటీ ప్రెస్ కొచ్చి పత్రికా విలేకరులకి, కొత్త రోడ్డు గురించి అయినా వీళ్ళు వివరణ ఇవ్వాలి ఈ నేషనల్ హైవే కి సంబం ధించిన ప్రతి నియోజక వర్గంలో ప్రెస్ మీట్ పెట్టాలి ప్రజలకు తెలియాలి అప్పుడు ప్రజలకు అర్థమ వుతుంది. ఎప్పుడైనా ఎక్కడున్నారా బయటికి వచ్చి ప్రజలకు బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి తెలియజేయాలని కోరుకుంటున్నాను.