Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం లోని తహసిల్దార్ కార్యాలయం నందు సోమవారం తహసిల్దార్ అమరేశ్వరి అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు పి. జి. ఆర్. ఎస్. కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండలం లోని సమస్యలపై వచ్చే ప్రజలకు ఒకచోట పరిష్కారం దొరికేలా ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. నందలూరు మండల పంచాయతీ లోని ఈదరపల్లి చెందిన వనం వెంకటమ్మ (70) అనే వ్యక్తి తన భూమిని వారి బంధు వులు తన భూమి 1.19 సెంట్ల ఆన్లైన్ చేయిస్తానని సంతకా లు పెట్టుకొని తనపేరు మీద ఆన్లైన్ చేసుకున్నాడని ఆమె తహసిల్దార్ కు అర్జీ ఇచ్చింది. అదే విషయం ఎలా ఆన్లైన్ చేసుకుంటావు అని ఆమె అతనిని అడగగా అతని తమ్ముడు ఆమె పై దాడి చేశాడని అతనికి రాజకీయ పలుకు బడి ఉండడం తో నేను ఏమి చేయలేక పోయానని, ప్రస్తుతం మీరైన న్యాయం చేయాలని ఆ అర్జీ లో పేర్కొన్నది. తహసిల్దార్ అర్జిదారును సమస్య విన్న తర్వాత తప్పకుండా పరిష్కారం కోసం మా సిబ్బందితో ఆ స్థలం పరిశీలించి తగిన చర్యలు తీసుకుని మీకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్య్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మోహన్ కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, పశుసంవర్థక శాఖ అధికారుల,వ్యయసాయ అధికారి, ఐ సి డి ఎస్ అధికారి,మండల సర్వేయర్, వీఆర్వోలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.